టి20 ఫార్మాట్ అంటేనే సిక్సర్లు ఫోర్ల మోత అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకసారి క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ ప్రతీ బంతిని కూడా బౌండరీ తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటాడూ అన్న విషయం తెలిసిందే. ఇక బౌలర్లు ఎక్కడ బంతి వేసిన దానిని సిక్సర్ గా  మలచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.  అందుకే టీ20 ఫార్మాట్ ను ప్రేక్షకులందరికీ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. సిక్సర్లు ఫోర్లు తో చెలరేగిపోతున్న బ్యాట్స్ మెన్ ను కంట్రోల్ చేసేందుకు అటు బౌలర్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇలా టీ-20 ఫార్మెట్లో బ్యాట్ కు e బంతికి మధ్య హోరాహోరీ పోరు జరుగుతూనే ఉంటుంది. ఇక ఎక్కువగా అయితే బ్యాట్మెన్స్ ఆధిపత్యాన్ని సాధిస్తూ ఉంటారన్నది క్రికెట్ విశ్లేషకులు చెప్పే మాట. ఇకపోతే ఇటీవల ముగిసిన ఐపీఎల్ కూడా బ్యాట్స్మెన్లు అందరూ కూడా సిక్సర్ల మోత మోగించారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ లో 863 పరుగులతో టాప్ స్కోరర్గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్న జోస్ బట్లర్ అటు సిక్సర్ల విషయంలో కూడా టాప్ లోనే కొనసాగుతూ ఉన్నాడు.  ఏకంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అత్యధికంగా 45 సిక్సర్లు కొట్టి ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా అవార్డు కూడా అందుకున్నాడు.


 ఇక జోస్ బట్లర్ వరకు ఓకే మరి ఈ బ్యాట్స్మెన్ తర్వాత ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ లుగా ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు  ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఆ వివరాల్లోకి వెళితే పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన స్టార్ ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ జోస్ బట్లర్ తర్వాత ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మన్ గా కొనసాగుతున్నాడు. మొత్తంగా ఐపీఎల్ లో 34 సిక్సర్లతో అదరగొట్టాడు లివింగ్ స్టోన్. ఆ తర్వాత కోల్కత నైట్ రైడర్స్ జట్టు లో కొనసాగుతున్న ఆండ్రూ రస్సెల్ 32 సిక్సర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సీజన్లో 30 సిక్సర్లు కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సెన్సు 26 సిక్సర్లతో సత్తా చాటాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl