బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే పటిష్టమైన జట్టు గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దిగ్గజాలకు సైతం గట్టి పోటీ ఇచ్చే విధంగా బంగ్లాదేశ్ జట్టు కనిపిస్తోంది. అలాంటి జట్టు ప్రస్తుతం వరుస విజయాలతో ఎంతో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు కి సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు మోమినుల్ హాక్. ఇక గత కొంత కాలం నుంచి సమర్థవంతంగా నే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అనే చెప్పాలి.


 అతని సారధ్యంలో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఎందుకొ అదృష్టం కలిసి రావడం లేదు. ఈ క్రమంలోనే విజయాల కంటే అటు బంగ్లాదేశ్ జట్టు పరాజయాలే ఎక్కువగా చవిచూడాల్సినా పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే అటు కెప్టెన్సీ పై గత కొంతకాలం నుంచి విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలోనే మొమినుల్ హక్ ఇటీవలే షాకింగ్ నిర్ణయం తీసుకొని అభిమానులందరినీ కూడా అవాక్కయ్యేలా చేశాడు. ఏకంగా తాను బంగ్లాదేశ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.


 ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. ఇటీవలే మోమినుల్ హాక్ తన కెప్టెన్సీకి రాజీనామా చేస్తూ ఆ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపాడు. 2019 నుంచి జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు మోమినుల్ హాక్. ఈ క్రమంలోనే 3 టెస్టుల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. 12 మ్యాచ్లలో బంగ్లాదేశ్ జట్టు అతని కెప్టెన్సీలో ఓడిపోవడం గమనార్హం. ఇక రెండు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఈ క్రమంలోనే కెప్టెన్గా జట్టును గెలిపించ లేనప్పుడు ఇక సారథ్య బాధ్యతలను వదులుకోవడమే మంచిదని భావిస్తున్నాను అంటు మోమినుల్ హాక్ చెప్పుకొచ్చాడు. ఇక బ్యాటింగ్ పై  దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అంటూ తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: