టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రస్థానం ఎంత విజయవంతంగా సాగింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్లో ఎన్నో ట్విస్టు లు ఉన్నాయి అని చెప్పాలి. అతను టీమిండియాలో చోటు దక్కించుకోవడం... తర్వాత సీనియర్లను కాదని మహేంద్రసింగ్ ధోని కి సారథ్య బాధ్యతలు అప్పగించడం.. ఆ తర్వాత సక్సెస్  ఫుల్ గా జట్టును ముందుకు నడిపించి మూడు ఐసీసీ టైటిల్స్ అందించడం.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడం ఇవన్నీ ఊహించని ట్విస్ట్ ల మధ్య జరిగి పోయాయి అని చెప్పాలి.


 అందుకే ఇప్పటికి కూడా మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అదే రేంజ్ లో క్రేజ్ వుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే మహేంద్రసింగ్ ధోనిజిల్లా క్రికెట్ అసోసియేషన్ సెలబ్రేషన్స్ కు హాజరు కావడం కాస్త ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే ఇలా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెలబ్రేషన్స్ కు ధోని హాజరు కావడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే మాట్లాడిన ధోని ఆసక్తి గా వ్యాఖ్యలు చేశాడు. నా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలపాలని అనుకుంటున్నాను.


 క్రికెటర్లు సొంత జిల్లాల తరఫున ఆడటం వల్ల దేశానికి ఆడతాం.. అందుకే దీన్ని గర్వంగా భావించాలి. నేను కూడా అందుకే రాంచీ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడినందుకు గర్వపడుతున్నాను.. జిల్లా తరఫున ఆడకపోయి ఉంటే దేశం తరఫున ఆడే వాడిని కాదు.. నా స్కూల్కి నా జిల్లాకు ఆడటం వల్ల దేశానికి ఆడే అవకాశం వచ్చింది. అందుకే వాళ్ళు లేకపోతే ఇప్పటికీ ఈ స్టేజ్ లో ఉండే వాడిని కాదు అంటూ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తనకు స్కూల్ దశలో జిల్లా స్థాయిలో కూడా సపోర్ట్ గా నిలిచిన ప్రోత్సహించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: