సరిగ్గా ఈ ఏడాది జనవరి నెలలో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లిన సమయంలో రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టు దూరమయ్యాడు. అప్పుడు కేవలం తాత్కాలిక కెప్టెన్సీ చేపట్టి జట్టును ముందుకు నడిపించాడు. కెప్టెన్సీలోని టీమిండియాతో టీ20 వన్డే సిరీస్ లు  ఆడింది. దీంతో కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీకీ పనికిరాడు అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక కె.ఎల్.రాహుల్ మాత్రం అటు లక్నో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఐపీఎల్లో సత్తా చాటాడు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇటీవల కేఎల్ రాహుల్ కు సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికా జట్టు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. కానీ చివరికి గజ్జల్లో గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఇటీవలే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమ్ లో సౌత్ ఆఫ్రికా తో మొదటి టి20 మ్యాచ్ ఆడింది భారత జట్టు. కాగా మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు అని చెప్పాలి.  బ్యాటింగ్ లో టీమిండియా పరవాలేదు అనిపించినా బౌలింగులో మాత్రం పూర్తిగా విఫలమైంది.



 సొంతగడ్డపై కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించడంలో విఫలమైంది. గతంలోనే  మొదటి టి20 మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే ఇక సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో రిషబ్ పంత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కీలక బౌలర్ గా కొనసాగుతున్న చాహల్ తో రెండు ఓవర్లు మాత్రమే వేయించడం ఆశ్చర్యాన్ని కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు. డసేన్ క్రీజులో ఉన్నప్పుడు చాహల్ తో బౌలింగ్ చేయాల్సింది. కానీ అక్షర పటేల్ కు బౌలింగ్ ఇచ్చారు. అదే సమయంలో డేవిడ్ మిల్లర్ సిక్సర్లు కొడుతున్నప్పుడు అయినా చాహల్ కు బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అతడు పురుగులు కంట్రోల్ చేసే వాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆశిష్ స్నేహ..

మరింత సమాచారం తెలుసుకోండి: