మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది. ఈనెల 27వ తేదీ నుంచి ఈ మినీ వరల్డ్ కప్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది. కాగా ఆగస్టు 28 వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ గురించి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. హై వోల్టేజ్ ఈ మ్యాచ్ ఉత్కంఠను ఎంజాయ్ చేసేందుకు  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భారత్ పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో అటు విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. గత కొంత కాలం నుండి విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే.



 ఇక అతను సెంచరీ చేసి కూడా మూడు ఏళ్ళు గడిచి పోతుంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు పేలవా ప్రదర్శన చేయడంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. విరాట్ కోహ్లీనీ జట్టు నుంచి పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఇక మరి కొంత మంది అతనికి కొన్నాళ్లపాటు విశ్రాంతి ఇచ్చి మళ్లీ జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నారు అని చెప్పాలి.. ఇకపోతే విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ గురించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 వరుసగా అన్ని రకాల మ్యాచ్ లు ఆడటం కారణంగా గత ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ తన శక్తిని కోల్పోయినట్లు కనిపించాడు అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ లాంటి నాణ్యమైన ఆటగాడు ఫాం లోకి రావాలంటే తప్పనిసరిగా విశ్రాంతి అవసరం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. నెలరోజుల రెస్టు తర్వాత ఆసియా కప్ లో ఆడబోతున్న విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చి రాణిస్తాడు అన్న నమ్మకం ఉంది. గత ఫామ్ అందుకోవాలంటే విరాట్ కోహ్లీకి కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్ చాలు అంటూ చెప్పుకొచ్చాడు షేన్ వాట్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి: