ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్లో డేవిడ్ వార్నర్ స్టార్ క్రికెటర్ గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి . ఎప్పుడు అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతూ ఓపెనర్ గా బరి లోకి దిగుతూ ఆస్ట్రేలియా జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియన్ క్రికెట్లో స్టార్ క్రికెటర్ గా ఉన్న డేవిడ్ వార్నర్ కెరియర్ లో కొన్ని రోజుల పాటు చీకటి రోజులు అనుభవించాడు. 2018లో బాల్ టాంపరింగ్ విధానం లో చిక్కుకొని కెప్టెన్సీ విషయం లో జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు.


 అదే సమయం లో ఇక రెండేళ్లపాటు అతనిపై నిషేధం కూడా విధిస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలర్ తీసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు దేశవాలి క్రికెట్కు కూడా డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు అని చెప్పాలి. అయితే ఆ తర్వాత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి మరోసారి తనదైన శైలిలో రాణిస్తున్నాడు.. కానీ ఇప్పటివరకు క్రికెట్ ఆస్ట్రేలియా అతనిపై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధం మాత్రం ఎత్తి వేయలేదు అని చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో క్రికెట్ ఆస్ట్రేలియా జీవితకాల కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.


 ఈ క్రమం లోనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమం లోనే లైఫ్ టైం కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేసి ఫించ్ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేడు జరగబోతున్న సమావేశం లో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇందుకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీంతో ఇక ఈ ప్రకటన కోసం డేవిడ్ వార్నర్ అభిమానులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: