గత కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ పేరు ఎంతలా మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ వస్తున్నాడు అని చెప్పాలి. కేవలం ఒకవైపు మాత్రమే కాదు మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడగల సామర్థ్యం కలిగిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే  సూర్యకుమార్ యాదవ్ పేరు కాస్త అటు సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా  మారిపోతూ ఉంది. అయితే భారత జట్టు నుంచి ఎంతోమంది మంచిగా పరుగులు చేస్తూ ఉన్నప్పటికీ అటు సూర్య కుమార్ యాదవ్ మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంలా మారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ బంతి వేసిన సరే ఎంతో అలవోకగా బంతిని బౌండరీకి తరలించడంలో సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో కూడా ప్రతి మ్యాచ్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జింబాబ్వేతో  జరిగిన మ్యాచ్ లో  కూడా మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సూర్య కుమార్ యాదవ్.


 ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ పేరుతో ఏకంగా మిస్టర్ 360 ప్లేయర్ అంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే తనకు వచ్చిన మిస్టర్ 360 ప్లేయర్ అనే బిరుదు గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ఒకే ఒక్కడు మిస్టరీ 360 ప్లేయర్ ఎ బి డివిలియర్స్.. నేను అతని లాగా ఆడటానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై ఏబి డివిలియర్స్  స్పందిస్తూ మీరు చాలా త్వరగా మిస్టర్ 360 దగ్గరికి చేరుకున్నారు. ఈరోజు చాలా బాగా ఆడారు అంటూ అతనిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం 

మరింత సమాచారం తెలుసుకోండి: