సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో మిగతా వాళ్లతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే గుర్తింపు ఉంటుంది .ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన విషయం ఏది తెరమీదకి వచ్చినా కూడా అధిక్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కేవలం క్రికెటర్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు క్రికెటర్ల కుటుంబీకులకు సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఎంతో మంది క్రికెట్ అభిమానులు అందరిని కూడా విచారంలో ముంచేసే ఒక వార్తా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.


 క్రికెట్ లో ఎన్నో ఏళ్ల పాటు సేవలు చేసి ఇక క్రికెట్ గాడ్ ఫాదర్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి కన్నుమూసాడు అనే వార్త ఇక క్రికెట్ అభిమానులందరినీ కూడా విషాదంలో ముంచేస్తుంది అని చెప్పాలి. ఇటీవలే మాజీ రైల్వే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సయ్యద్ హైదర్ అలీ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు కావడం గమనార్హం. ఎన్నో ఏళ్ల పాటు రైల్వే క్రికెట్లో సేవలు అందించిన హైదర్ అలీ ఇక రైల్వే క్రికెట్కు గాడ్ ఫాదర్గా గుర్తింపు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఎంతో మంది క్రికెటర్లకు అయినా స్ఫూర్తిగా నిలిచారు.



 సయ్యద్ హైదర్ హలీ 1963 - 64  సీజన్లో తొలిసారి రైల్వేస్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి దాదాపు 20 ఏళ్ల పాటు పాటు ఇక క్రికెట్ ఊపిరిగా బ్రతికాడు ఆయన. ఇక ఆయన కెరియర్ లో 113 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 366 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రైల్వేస్ క్రికెట్లోకి అడుగుపెట్టే ప్రతి ఆటగాడికి కూడా సయ్యద్ హైదర్ అలీ స్పూర్తిగా నిలుస్తూ ఉండేవాడు. ఇకపోతే ఇటీవలే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటు కారణంగా చనిపోయారు. చాతిలో నొప్పిగా ఉంది అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.  కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించగా  అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మృతి పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: