ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా ఇక  ప్రస్తుతం టి20 సిరీస్ జరుగుతుంది. ఇకపోతే ఇటీవలే న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు.. 65 పరుగుల తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు 192 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ 51 బంతులో 111 పరుగులు చేసి సెంచరీ తో చెలరేగిపోయి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇక ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 126 పరుగులకే కుప్పకూలిపోయింది. అయితే భారత బౌలర్ దీపక్ హుడా నాలుగు వికెట్లతో చెలరేగిపోయాడు. చాహల్ సిరాజ్ లు కూడా తల రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు.


 మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో అటు దీపక్ హుడాకి అవకాశం దక్కినప్పటికీ పెద్దగా తుదిజట్టులో మాత్రం అవకాశం దొరకలేదు అన్న విషయం తెలిసిందే  ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో తుదిజట్టులో అవకాశం దక్కించుకున్న దీపక్ హుడా ఇక బౌలింగ్ చేసే ఛాన్స్ కూడా కొట్టేసాడు. దీంతో తన బౌలింగ్ మ్యాజిక్ ఏంటో చూపించాడు. ఇక అయితే ఇటీవలే రెండో టి20 లో భాగంగా 2.5 ఓవర్లు వేసిన దీపక్ హుడా కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇలా కెరియర్ లోనే అత్యుత్తమమైన ప్రదర్శన చేశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


దీపక్ హుడా ప్రదర్శన చూసిన తర్వాత టీమిండియా ప్రేక్షకుల సైతం షాక్ అయ్యారు  అతనిలో ఇంత ప్రతిభ దాగి ఉందా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవలే ఇలా తన బౌలింగ్ తో మ్యాజిక్ చేసిన దీపక్ హుడా  ఒక అరుదైన రికార్డు సృష్టించాడు   న్యూజిలాండ్ పై టీ20లలో భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఎవరూ కూడా న్యూజిలాండ్ జట్టుపై వారి సొంత దేశంలో ఇలాంటి ప్రదర్శన చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: