ప్రస్తుతం ఖతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల లీగ్ మ్యాచ్ లు జరిగిన నేపద్యంలో.. అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోరాడాయ్. కానీ కొన్ని జట్లు మాత్రమే అటు నాకౌట్ దశకు చేరుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లీక్ మ్యాచ్ లే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగగా.. ఇక ఇప్పుడు నాకౌట్ మ్యాచ్లు మరింత హోరాహోరీగా జరగబోతున్నాయి అన్నది తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈసారి ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్ల లో ఏ జట్టు కప్పు గెలిచే అవకాశం ఉంది అనే విషయంపై అందరూ  చర్చించుకుంటున్నారు. ఇక ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించి అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై ఎంతో మంది క్రీడ నిపుణులు స్పందిస్తూ తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇక ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్న విషయంపై అర్జెంటిన కెప్టెన్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 తాను కెప్టెన్సీ వహిస్తున్న అర్జెంటిన జట్టుతో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్ జట్లలో ఏదో ఒక జట్టు ఫిఫా వరల్డ్ కప్ ను గెలుచుకునే అవకాశం ఉంది అంటూ మెస్సి చెప్పుకొచ్చాడు. అర్జెంటినా కాకుండా ఈ మూడు జట్లు తన ఫేవరెట్ అంటూ తెలిపాడు. ఇక ఈ ఏడాది జరుగుతున్న వరల్డ్ కప్ లో బ్రెజిల్ అద్భుతంగా ఆడుతుంది అంటూ ప్రశంసలు కురిపించాడు. తన జట్టు విషయంలోనే కాదు ఇతర జట్ల విషయంలో కూడా స్పోర్టివ్ గా ఉన్న మెస్సి పై ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా అర్జెంటీనా జట్టు మరికొన్ని రోజుల్లో నాకౌట్ మ్యాచ్లను ప్రారంభించబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: