ప్రస్తుతం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే . ఇక ఈ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడుతుంది టీమిండియా జట్టు. అయితే ఇక సీనియర్లతో కూడిన టీమిండియా మంచి ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంటుందని అభిమానులందరూ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అందరి అంచనాలు తారు మారు అయిపోయాయి అని చెప్పాలి.. ఎందుకంటే మొదటి వన్డే మ్యాచ్ లో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా ఇక రెండవ మ్యాచ్ లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుందని భావించిన అది జరగలేదు.


 ఇక రెండవ వన్డే మ్యాచ్లో కూడా ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు మూడు మ్యాచులు వన్డే సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను అటు బంగ్లాదేశ్ చేతిలో పెట్టేసింది. దీంతో ఇక టీమ్ ఇండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి.  అయితే వన్డే సిరీస్ ముగిసిన వెంటనే అటు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడబోతుంది టీమిండియా. ఇకపోతే నేడు నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మూడో మ్యాచ్లో గెలుస్తుందని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.


 ఇకపోతే బంగ్లాదేశ్ తో నేడు చెటోగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ కోసం 14 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ, కుల్దీప్ సేన్, దీపక్ చాహార్ లు గాయాల కారణంగా జట్టు కు దూరం అయ్యారు. అయితే చైనా మాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇక వన్డే జట్టులో చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అదే సమయంలో రోహిత్ లేకపోవడంతో ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ రెండో వన్డే మ్యాచ్లో కెప్టెన్సీ చేపట్టబోతున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: