ఈ ఏడాది ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా  మారింది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల ఊహకందని ఫలితాలు రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఏకంగా గెలుస్తాయి అనుకున్న జట్టు ఓడిపోవడం.. ఓడిపోతాయి అనుకున్న జట్లు  అదిరిపోయే విజయాల సాధించడం చూసి అందరూ షాక్ అయ్యారు. దీంతో ఇక ప్రతి మనిషిని కూడా కన్నార్పకుండా వీక్షించారు ప్రత్యక్షులు. అయితే ఇక  ఈ ఏడాది ఖాతార్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో  మొరాకో జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.


 ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఛాంపియన్ జట్లకు సైతం ముచ్చమటలు పట్టించింది. ఎక్కడ పరాజయం పాలు కాకుండా వరుస విజయాలతో దూసుకు వచ్చి సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. ఇలా ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ అడుగుపెట్టిన ఆఫ్రికన్ జట్టుగా మొరాకో చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇక టోర్నీ మొదటి నుంచి మొరాకో ఆడిన ఐదు మ్యాచ్లలో కూడా ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా ఇవ్వలేదంటే.. ఇక మొరాకో జట్టు టీం డిఫెన్స్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మొరాకో జట్టు ఏకంగా టైటిల్ గెలుస్తుందేమో అని అంచనాలను ప్రతి క్రీడాభిమానిలో ఒక ఆలోచన మెదిలింది.


 చెప్పలేం.. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అని ఎంతోమంది ఇక మొరాకో ప్రదర్శన గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక సెమి ఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్ తో మొరాకొ మ్యాచ్  ఎంతో ఉత్కంఠ బరితంగా  బరితంగా మారింది.  అయితే ఈ మ్యాచ్ లో అప్పటి వరకు వరుస విజయాలు సాధించిన మొరాకో చివరికి ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. అదే సమయంలో ప్రత్యర్థి గోల్స్ ని అడ్డుకోలేకపోయింది. దీంతో ఇక వరల్డ్ కప్ గెలవాలని కల నెరవేరకుండానే చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించింది మొరాకో.

మరింత సమాచారం తెలుసుకోండి: