ఫిఫా వరల్డ్ కప్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నేటితో ఇక ఫిఫా వరల్డ్ కప్ ఉత్కంఠకు తెరపడబోతోంది అని చెప్పాలి. నేడు క్రీడా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా అర్జెంటినా ఫ్రాన్స్ మధ్య హోరాహోరీ పోరు జరగడానికి అంత సిద్ధమైనది అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రీడా ప్రపంచం మొత్తం ఇక ఈ మ్యాచ్ చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.


 ఇక ఈ ఫైనల్ పోరులో ఎవరు విజయం సాధించి విశ్వవిజేతగా నిలుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో ఇక ఫైనల్లో విజేతగా నిలిచేందుకు ఈ రెండు జట్లు పోటీ పడుతూ ఉంటే.. ఇక ఇటీవలే ఇక ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా మూడవ స్థానంలో నిలిచేందుకు ఇక సెమి ఫైనల్ లో నిష్క్రమించిన రెండు జట్లు కూడా పోటీ పడ్డాయి అన్న విషయం తెలిసిందే. మొదటినుంచి అద్భుతంగా రానించి ఫైనల్ లో చోటు దక్కించుకో లేకపోయినా మొరాకో, క్రొయేసియా  జట్ల మధ్య ఇక మూడవ స్థానం కోసం హోరాహోరీ పోరు జరిగింది అని చెప్పాలి.


 ఇక ఈ మ్యాచ్ లో భాగంగా స్ట్రాంగ్ డిఫెన్స్ ఉన్నా మొరాకో క్రొయేషియా గోల్స్ ని ఆపడంలో మాత్రం విఫలమైంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆట ముగిసే సమయానికి 2-1 తేడాతో అటు క్రోయేషియా జట్టు మొరాకో పై విజయం సాధించింది. ఆఫ్ టైం తర్వాత ఇరు జట్లు కూడా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. ఇక మరోవైపు ఈ గెలుపుతో మూడవ స్థానాన్ని దక్కించుకున్న క్రొయేషియా చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించింది అని చెప్పాలి. ఇక జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ఎవరు విన్నర్.. ఎవరు రన్నరప్ గా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది అన్నది చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: