గత కొంతకాలం నుంచి టెస్ట్ ఫార్మాట్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇక ఇటీవలే మళ్లీ తన మునుపటి ఫామ్ ను అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికా తో ఇటీవల జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో భాగంగా తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఏకంగా డబుల్ సెంచరీ సాధించి ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయిన సమయంలో తనపై విమర్శలు చేసిన వారందరికీ కూడా బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు డేవిడ్ వార్నర్.


 ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీపై ప్రస్తుతం ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సైతం ప్రశంస కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఒక ఇన్నింగ్స్ తో పాటు 188 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడితో ముగిసిపోలేదు. ఇంకా చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, యాసిష్ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా విజయం సాధించడం తనలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంపొందించింది అంటూ చెప్పుకొచ్చాడు.


 మీరు నా వయసు గురించి మాట్లాడటం మానేయాలని కోరుకుంటున్నాను. నాకు 36 ఏళ్ల వయసు ఉన్నట్లు అనిపించడం లేదు. ఎందుకంటే జట్టులో ఉన్న చాలా మంది యువ ఆటగాళ్ల కంటే వేగంగా పరిగెత్తగలుగుతున్నాను. కాబట్టి వారు నన్ను అందుకున్నప్పుడు వయసు గురించి ఆలోచించాలి. భారత్లో విజయం సాధించడం ఇంగ్లాండులో సిరీస్ ను పూర్తిగా గెలవడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇక ఈ రెండు సిరీస్ లకు సిద్ధంగా ఉండాలని కోచ్, సెలెక్టర్లు నాకు ముందే చెప్పారు. నేను జట్టుకు ఎలాంటి శక్తిని తీసుకురాగాలనో నాకు తెలుసు అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. పరుగులు చేయాలనే ఆకలి నాలో ఇంకాఅలాగే ఉంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: