సాదరణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇక క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా న్యూస్ ఇంటర్నెట్ లోకి వచ్చింది అంటే చాలు అది తెగ వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి భారత జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ కు సంబంధించిన ఒక వార్త అభిమానులు అందరిని కూడా ఆందోళనకు గురిచేసింది అని చెప్పాలి.


 ప్రస్తుతం భారత హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని.. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని.. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది అని చెప్పాలి. దీంతో రాహుల్ ద్రవిడ్ అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అతనికి ఏమైంది అన్న విషయంపై సరైన క్లారిటీ లేకపోవడంతో మరింత ఆందోళన చెందారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూడటం మొదలుపెట్టారు.


ఈ క్రమంలోనే భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆరోగ్యం బాగా లేకపోవడంపై ఇక భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. రాహుల్ ద్రావిడ్ ఆరోగ్యం బాగాలేదు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ కొట్టి పారేశాడు  విక్రమ్ రాథోడ్. ద్రావిడ్ కు ఎలాంటి సమస్య లేదు అంటూ స్పష్టం చేశాడు. శ్రీలంకతో తిరువనంతపురం వేదికగా జరిగే మూడో వన్డేలో టీమ్ ఇండియాకు అందుబాటులో ఉంటాడు అన్న విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు. ఇక వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేయడం గురించి మాట్లాడుతూ.. ఆటగాళ్లు టీ20 సిరీస్లో ఆడితేనే ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంపై క్లారిటీ వస్తుంది అంటూ బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: