ఒకప్పుడు ఏ వయసు వారు ఆ వయసు వారిని పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది అనిపెద్దలు చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే పాతికేళ్ల యువకుడికి 20 ఏళ్ల పైబడిన యువతిని ఇచ్చి పెళ్లి చేసేవారు. ఇక అంతకంటే తక్కువ వయసు వారిని కూడా ఇచ్చి పెళ్లి చేయడం చేసేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా పోయింది అని చెప్పాలి. ముఖ్యంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమకంటే ఎంతో చిన్నవారైనా వ్యక్తులతో రిలేషన్ లో కొనసాగుతూ ఉండడం.. ఇక కొన్ని కొన్ని సార్లు పెళ్లి చేసుకోవడం కూడా చేస్తున్నారు.


 ఇలా ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం లేదా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండడం లాంటివి చేసి ఎప్పుడు వార్తలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నారు. అందుకే ఎవరైనా సెలబ్రిటీలకు సంబంధించిన పెళ్లి జరిగిందంటే చాలు ఇక కాబోయే వధూవరులు ఇద్దరు మధ్య కూడా ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల బాలీవుడ్ లో పెళ్లి చేసుకున్న రణబీర్ కపూర్, అలియాభట్ మధ్య 11 ఏళ్ల గ్యాప్ ఉంది. రణబీర్ కు నలభై ఏళ్లు కాగా ఆలియాకు 29 ఏళ్లు.


 అయితే ఇటీవల స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తన ప్రియురాలు అతియా శెట్టి నీ పరిమిత బంధుమిత్రుల మధ్య ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి.. ఫామ్ హౌస్ లో ఈ పెళ్లి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయబడిన వేదికపై జరిగింది అని చెప్పాలి. అయితే ఇక వీరిద్దరి మధ్య ఏజ్ క్యాప్ ఎంత ఉంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం అతియా శెట్టి వయస్సు 30 ఏళ్లు కావడం గమనార్హం. 1992 నవంబర్ 5న జన్మించింది అతియా శెట్టి. ఇక స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఏప్రిల్ 18 1992లో జన్మించాడు. ఇక అతని వయసు కూడా 30 సంవత్సరాలు కావడం గమనార్హం. అయితే సరిగ్గా చూసుకుంటే మాత్రం కేఎల్ రాహుల్ అతియా శెట్టి కంటే ఏడు నెలలు పెద్దవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: