
ఇలా గాయం కారణంగా దూరమైన ఆటగాళ్ళు జట్టులోకి వచ్చి అటు టీమిండియా ఎంతో పటిష్టంగా మారుతూ ఉంటే.. ఇక భారత ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాకు మాత్రం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాకుతున్నవారు.. వరుసగా గాయాల బారిన పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్లో ఇక అందుబాటులో ఉండడం కూడా కష్టంగానే మారుతుంది అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న మిచెల్ స్టార్క్ గాయం కారణంగా మొదటి మ్యాచ్కు దూరమయ్యాడు.
ఇక ఇప్పుడూ ఆస్ట్రేలియా జట్టుకు ఇలాంటిదే మరో ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఆస్ట్రేలియా జట్టులో మరో కీలక ఫేసర్ గా కొనసాగుతున్న జోష్ హెజిల్ వుడ్ సైతం అందుబాటులో ఉండడం లేదు అన్నది తెలుస్తుంది. అదే సమయంలో ఫేస్ ఆల్రౌండర్ అయిన కామెరూన్ గ్రీన్ సైతం ఇక తొలి టెస్ట్ మ్యాచ్లో గాయం కారణంగా బౌలింగ్ కు దూరంగానే ఉంటాడు అని సమాచారం. దీంతో ఆస్ట్రేలియా బౌలింగ్ దళం ఎంతో బలహీనంగా మారుతుంది అన్నది తెలుస్తుంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9వ తేదీన మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.