గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో అవకాశాలు దక్కించుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నారూ. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ తామే అన్న విషయాన్ని నిరూపిస్తూనే ఉన్నారు. ఇక వచ్చిన అవకాశాన్ని ఒడిసిపెట్టి పరుగుల వరద పారిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఇటీవలే కాలంలో ఎంత మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నప్పటికీ అటు సీనియర్ ఆటగాళ్ళ కారణంగా ఎక్కువగా తుది జట్టులో మాత్రం కనిపించడం లేదు.


 సీనియర్ ప్లేయర్లు ఎంత పేలవా ప్రదర్శన చేసినప్పటికీ ఇక వరుసగా అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ సెలెక్టర్లు యువ ఆటగాళ్లు తమను తామును నిరూపించుకునేందుకు పరుగుల వరద పారించిన కూడా నెక్స్ట్ మ్యాచ్ లో ఉంటారా లేదా అన్న గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు అని చెప్పాలి. అయితే ఇలా గత కొంతకాలం నుంచి బాగా ఆడకపోయినప్పటికీ కేఎల్ రాహుల్ ను సీనియర్ అన్న కారణంతో జట్టులో కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు అని చెప్పాలి.


 అయితే  రాహుల్ కు వరుసగా అవకాశాలు ఇవ్వడంపై భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ ప్రతిభ పట్ల నాకు గౌరవం ఉంది.  కానీ అతను కొన్ని రోజులుగా సరిగా ఆడటం లేదు. 8 ఏళ్ల కెరియర్లో 46 టేస్టులు ఆడిన అతని సగటు 34 మాత్రమే. అదే సమయంలో బాగా ఆడుతున్న గిల్,  సర్ఫరాజు లాంటి వాళ్లకు అస్సలు అవకాశాలు రావడం లేదు. కేవలం ఫేవరెటిజం కారణంగానే కేఎల్ రాహుల్కు జట్టులో చోటు దక్కుతుంది. మయాంక్ అగర్వాల్,  హనుమ విహారి కూడా కేఎల్ రాహుల్ కంటే బాగా ఆడుతున్నారు అంటూ వెంకటేష్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: