బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే పేరుతో మొత్తం పది జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 15 సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ప్రపంచంలోనే బెస్ట్ టీ 20 లీగ్ గా ప్రాచుర్యం పొందింది. అయితే గత కొంతకాలంగా మహిళల ఐపీఎల్ ను కూడా స్టార్ట్ చేయాలనీ బీసీసీఐ యోచిస్తున్న మాట వాస్తవమే. అందుకు ఇన్ని రోజులకు ముహూర్తం కుదిరింది. ఈ రోజు మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ కు సంబంధించిన వేలం జరిగింది. ఈ వేలంలో ప్రపంచం నలుమూలల నుండి మొత్తం 409 మంది మహిళా క్రికెటర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఈ ఐపీఎల్ లో మొత్తం అయిదు జట్లు మాత్రమే పాల్గొనబోతున్నాయి. వాటిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జయింట్స్, యుపి వారియర్స్ లు ఉన్నాయి. ఈ మహిళల ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కొట్టే సత్తా ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేసిందని చెప్పాలి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల ఐపీఎల్ జట్టుకు . ఆర్సీబీ చాలా జాగ్రత్తగా ఆచితూచి వేలంలో ప్లేయర్స్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఆయా మహిళా క్రికెటర్లు చేసిన ప్రదర్శనను ఆధారంగా చేసుకుని చాలెంజర్స్ యాజమాన్యం ఆటగాళ్లను తీసుకుంది.

ఇక ప్రస్తుతం ఆర్సీబీ సొంతం చేసుకున్న ప్లేయర్స్ లో ముగ్గురు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. మొదటగా ఇండియా స్టార్ స్మృతి మందన్న  కోసం ముంబై మరియు బెంగళూరు లు పోటీ పడ్డాయి. చివరికి 3 .4 కోట్ల తో స్మృతి మందున్నను బెంగుళూరు సొంతం చేసుకుంది. ఈమెనే ఆ జట్టుకు కెప్టెన్ గా నియమించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. స్మృతి మాత్రమే కాకుండా మరో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకుని.. అప్పుడే టైటిల్ ఫేవరెట్ గా అనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ ఎలీషా పెర్రీ ని కేవలం 1 .7 కోట్లతో సొంతం చేసుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపుతిప్పగల నైపుణ్యం పెర్రీ సొంతం. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ ను కూడా ఆర్సీబీ కొనుగోలు చేసి మిగిలిన జట్లకు డేంజర్ బెల్స్ మోగించింది .  

మరింత సమాచారం తెలుసుకోండి: