సాధారణంగా పాకిస్తాన్ జట్టును నిలకడలేమికి కేరాఫ్ అడ్రస్ గా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు చూపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. గెలుస్తుంది అనుకుని అందరూ నమ్మకం పెట్టుకున్న మ్యాచ్లో కూడా అనూహ్యంగా పాకిస్తాన్ ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే సమయంలో ఇక ఓడిపోవడం ఖాయం అనుకున్న మ్యాచ్లలో కూడా అద్భుతంగా పుంజుకుని గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇలా పాకిస్తాన్ జట్టులో ఎక్కువగా నిలకడలేమి పురుష క్రికెట్లో ఎక్కువగా చూస్తూ ఉంటామని చెప్పాలి.


 అందుకే పాకిస్తాన్ క్రికెటర్ల ప్రదర్శన పై ఎప్పుడు ఆ దేశ అభిమానుల విమర్శలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కేవలం పురుషుల క్రికెట్లో మాత్రమే కాదు అటు మహిళల క్రికెట్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్న విషయం ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో మ్యాచ్ ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులారా చేజార్చుకుంది పాకిస్తాన్ మహిళల జట్టు. ఈ క్రమంలోనే సెమీఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది అని చెప్పాలి. ప్రస్తుతం గ్రూప్ బి లో భాగంగా పాకిస్తాన్, వెస్టిండీస్ ఉమెన్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.


 అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్తాన్ ఉమెన్స్ టీం. అయితే 113 పరుగులకే పరిమితమై మూడు పరుగుల తేడాతో చివరికి ఓటమి చవి చూసింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో గెలవాల్సిన మ్యాచ్ను అటు నిలకడలేమి కారణంగా పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు చేజార్చుకున్నారు అని చెప్పాలి. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ల జోరు చూస్తే తప్పకుండా ఆ జట్టే విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చివరి డెత్ ఓవర్లలో అటు వెస్టిండీస్ బౌలర్లు పట్టు బిగించడంతో పాకిస్తాన్ ఒత్తిడిలో మునిగిపోయింది. దీంతో ఒకవైపు పరుగులు రాబట్ట లేక మరోవైపు వికెట్ ను కాపాడలేక చేతులెత్తేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: