టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 100 రెడ్ బుల్స్ తాగిన ఎనర్జీ అతనిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీనే అటు ప్రత్యర్థులు కోహ్లీని చూస్తే భయపడేలా చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే కాదు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. భారీగా పరుగులు చేస్తూ ఇక ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 అయితే ఇక ఇలా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పొరపాట్లు చేసి వికెట్ సమర్పించుకోవడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా క్రీజు వదిలి బయటకు వెళ్లి ఇక ప్రత్యర్థికి స్టంప్ అవుట్ రూపంలో వికెట్ సమర్పించుకోవడం లేదా పరుగులు తీస్తున్న సమయంలో రన్ అవుట్ కావడం కోహ్లీ కెరియర్లో చాలా అరుదుగా జరిగాయి అని చెప్పాలి. అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో మాత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ లోనే తొలిసారి ఎప్పుడూ లేని విధంగా వికెట్ కోల్పోయాడు. ఏకంగా స్టంప్ అవుట్ గా వెనుతిరికాడు అని చెప్పాలి.


 వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ రెండో టెస్టులో మాత్రం ఇదే జరిగింది. బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన రెండో టెస్టులో ఇలా స్టంప్ అవుట్  అయ్యాడు విరాట్ కోహ్లీ. భారత రెండవ ఇన్నింగ్స్ సమయంలో 19 ఓవర్ ను  మర్పి వేశాడు. అయితే ఆ ఓవర్లో రెండో బంతిని కోహ్లీ ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడెందుకు ప్రయత్నించాడు.  అయితే బంతి మిస్ అయి కీపర్ అలెక్స్ కేరి చేతుల్లోకి వెళ్ళింది. ఇక కీపర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెకంన్ల కాలంలోనే వికెట్లను గిరాటేశాడు. అయితే ఆలోపు విరాట్ కోహ్లీ క్రీజులో బ్యాట్ పెట్టలేకపోయాడు. దీంతో కోహ్లీ తొలిసారి తన టెస్టు కెరియర్లో స్టంప్ అవుట్  అయ్యాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు టెస్ట్ కెరియర్ ప్రారంభించి 15 ఏళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇలా అవుట్ కాలేదు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: