టీమిండియాలో ముగ్గురు కొదమ సింహాలు అదరగొడుతున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా ముగ్గురు ప్లేయర్లను ఇలా కొదమసింహాలుగా అభివర్ణిస్తూ ప్రశంసలు వర్షం కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా తో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా అన్ని విభాగాల్లో కూడా సూపర్ ఫామ్ కనబరుస్తుంది  భారత జట్టు. ప్రత్యర్థి పై పూర్తి పైచేయి సాధిస్తుంది అని చెప్పాలి. పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను సైతం చిత్తుగా ఓడిస్తూ వరుసగా మ్యాచ్లలో విజయాలను సాధిస్తూ ఉంది.


 ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లో 132 పరుగులు తేడాతో విషయం సాధించి జోరు చూపించిన టీమ్ ఇండియా.. ఇక రెండో టెస్టు మ్యాచ్లో కూడా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకొని మరోసారి సత్తా చాటింది అని చెప్పాలి. ఇంతకీ ప్రస్తుతం ప్రేక్షకులు చెప్పుకుంటున్న ఆ ముగ్గురు కొదమసింహాలు ఎవరో కాదు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ లు. రెండు మ్యాచ్ లలో  టీమిండియా విజయం సాధించింది అంటే ఇక ఈ ముగ్గురి కారణంగానే అని చెప్పాలి. అందుకే ఇక టీమిండియాలో ఈ ముగ్గురిని కూడా మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తున్నారు అభిమానులు.


 రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. అక్షర్ పటేల్ అశ్విన్ లు తమ భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. ఇక మరోవైపు జడేజా బ్యాట్ తోనే కాదు బంతితో కూడా రానించాడు. తొలి టెస్ట్ లో ఏడు వికెట్లు తీసిన జడేజా.. రెండో టెస్ట్ లో 10 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్లో తొలి టెస్ట్ లో 70 పరుగులు రెండో టెస్టులో 26 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక అశ్విన్ విషయానికి వస్తే.. తొలి టెస్ట్ లో 8 వికెట్లు రెండో టెస్టులో ఆరు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ పరంగా తొలి టెస్ట్ లో 23 రెండో టెస్టులో 37 పరుగులు చేశాడు. అయితే ఒకే ఒక వికెట్ తీసిన అక్షర్ పటేల్ అటు బ్యాట్ తో మాత్రం రెండు టెస్టుల్లోను రెండు అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టాప్ ఆర్డర్ విఫలం అవుతున్న వేళ ఈ ముగ్గురే జట్టును ఆదుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: