ఐసీసీ ప్రతివారం కూడా టెస్ట్ ర్యాంకింగ్స్ ని ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ వారం మొత్తంలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు తమ ర్యాంకును మరింత మెరుగుపరుచుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. మంచి ప్రదర్శన చేస్తూ వస్తున్న టీమిండియా స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఇక ఐసిసి ప్రకటించే టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంపై కన్నేశాడు. ఇలా నెంబర్ వన్ కావడమే లక్ష్యంగా ముందుకు సాగాడు.


 అయితే అతనికి ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆస్ట్రేలియా తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అశ్విన్ అందరూ అంచనా వేసినట్లుగానే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వారంలోనే అటు ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ అశ్విన్ తో కలిసి అగ్రస్థానాన్ని షేర్ చేసుకున్నాడు.


 ఇక ఇటీవల ఈ వారం ఫ్రెష్ గా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో అశ్విన్ ఒక్కడే మళ్ళీ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 25 వికెట్లు పడగొట్టిన అశ్విన్ 869 పాయింట్లతో జేమ్స్ అండర్సన్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక మరోవైపు బ్యాట్స్మెన్ ల జాబితాలో కోహ్లీ ఏడు స్థానాలు ఏగబాకి 13వ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. ఇక 9, 10 స్థానాలలో రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఉన్నారు. ఇక అటు రవీంద్ర జడేజా మాత్రం ఎనిమిదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానంలోకి పడిపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: