ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ టీం.. ధోని కెప్టెన్సీ లో బరిలోకి దిగుతూ ప్రతి ఏడాది కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే అటు చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఎక్కువగా ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలిచినప్పటికీ ఇక రికార్డుల విషయంలో.. ఎక్కువసార్లు ఫైనల్స్ చేరిన విషయంలో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ రికార్డును ఇప్పటివరకు ఏ జట్టు బ్రేక్ చేయలేకపోయింది అని చెప్పాలి.


 అలాంటి ఛాంపియన్ టీం గత ఏడాది మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. కనీస పోటీ ఇవ్వలేక అటు పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అంతేకాదు లీగ్ దశ నుంచి ఇక టోర్ని నుంచి నిష్క్రమించింది. అంతేకాదు ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ విషయంలో గత ఏడాది సీజన్లో గందరగోల పరిస్థితి నెలకొంది. అయితే ఇక ఈ ఏడాది ధోని కెప్టెన్సీ లో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. మరోసారి టైటిల్ ఫేవరెట్ గా ఉంది అని చెప్పాలి.  ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ కొడతామని అటు చెన్నై అభిమానులు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో జట్టు అభిమానులకు ఉపద్రవంలాంటి వార్త వినిపించింది.


 ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడని.. మొదటి మ్యాచ్ ఆడటం అనుమానమే అంటూ వార్త తెరమీదకి వచ్చింది. ఇక నేడు అహ్మదాబాద్ లో గుజరాత్ తో జరిగే మొదటి మ్యాచ్ లో అతను ఉంటాడా లేదా అనేది సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో విశ్వనాథన్ స్పందించాడు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ధోని రేపు కచ్చితంగా మ్యాచ్ ఆడతారు. ఆపైన అప్డేట్ గురించి తెలియదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ధోని ఆడతాడా లేదా అన్న విషయం మాత్రం ఇక నేడు సాయంత్రం జరిగే ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ రానుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: