బిసిసిఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయ్ అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వచ్చాయి. అయితే క్రికెటర్ల విషయంలో ఇలాంటి వార్తలు ఎన్నో ఎప్పుడు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నిజాలు ఉంటాయి. ఇక ఇప్పుడు సౌరబ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదాలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు అంటూ అందరూ భావించారు.



 కానీ ఈనెల 15వ తేదీన ఐపీఎల్ లో భాగంగా ఆర్సిబి, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో సౌరబ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ మ్యాచ్లో ఆర్సిబి విజయం సాధిస్తే ఢిల్లీ ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో.. విరాట్ కోహ్లీ, గంగూలి కూడా ఎదురుపడ్డారు. దీంతో అంతకుముందు ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ తో చేయి కలిపిన కోహ్లీ గంగూలితో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. మరోవైపు గంగూలి కూడా కోహ్లీని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు.



 ఇది జరిగిన తర్వాత రోజే ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం కూడా సంచలనగా మారింది. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ ఢిల్లీ జట్టు అసిస్టెంట్ కోచ్ అయినా షైన్ వాట్సన్ స్పందించాడు. ది గ్రేట్ క్రికెటర్ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో ఈ విషయంపై మాట్లాడాడు. కోహ్లీ, గంగూలి వివాదం పై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కాస్త సంశయిస్తూనే.. కోహ్లీ కడుపులో మంట ఉందని అన్నాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందని విషయంలో మనకైతే స్పష్టత లేదు.  వారిద్దరి వివాదం పై పుకార్లు అయితే ఉన్నాయి. ఏం తెలియకుండా ఇందులో జోక్యం చేసుకోవడం సరికాదు. కానీ కోహ్లీ కడుపులో మంట ఉండే ఉంటుంది అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: