టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని అందరూ మిస్టర్ కూల్ కెప్టెన్ అని అభివర్ణిస్తూ ఉంటారు. దీనికి కారణం అతను ఒత్తిడి సమయంలో కూడా ఎంతో కూల్ అండ్ కామ్ గా ఉండడమే. సాధారణంగా అయితే ఏ ఆటగాడు అయినా సరే ఒత్తిడి సమయంలో కోపం చిరాకుతో ఊగిపోతూ ఉంటాడు. కానీ మహేంద్రసింగ్ ధోని మాత్రం నరాలు తెగే ఉత్కంఠ మధ్య కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు అని చెప్పాలి. లోపల ఉత్కంఠకు రైళ్లు పరిగెడుతున్న దానిని బయటకి చూపెట్టకుండా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాడు.



 మహేంద్ర సింగ్ ధోని లో ఉన్న ఈ ప్రత్యేకమైన స్వభావమే అందరు క్రికెటర్లలో కెల్లా అతని ఉన్నత స్థానంలో నిలిపింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కీ రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఐపిఎల్ లో మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఎంతో ప్రశాంతంగా ఉండే మహేంద్ర సింగ్ ధోని సీరియస్ అవడం కేవలం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా ధోని ఇలా ఒక యువ బౌలర్ పై సీరియస్ అయ్యి చిరాకుపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.




 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ ను పతి రాన వేశాడు. అయితే ఆ ఓవర్ మూడో బంతిని హెట్ మేయర్ ఆడే ప్రయత్నంలో అతని కాలికి తగిలి ధోని వైపు బంతి వెళ్ళింది. అయితే అంపైర్ లెగ్ బై ఇవ్వగా.. హెచ్ మైర్ పరుగు కోసం ప్రయత్నించాడు. బంతిని అందుకున్న ధోని నేరుగా నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు మెరుపు వేగంతో డైరెక్ట్ త్రో వేశాడు. అయితే ఆ సమయంలో బౌలర్ పతిరానా బంతిని అందుకునే ప్రయత్నంలో భాగంగా త్రోకీ అడ్డు వచ్చాడు. అప్పటికి హెట్ మైర్ క్రీజు లోకి చేరుకోలేదు. ఒకవేళ ధోని వేసిన త్రో వికెట్లకు నేరుగా వెళ్లి తాకి ఉంటే మాత్రం రన్ అవుట్ అయ్యేవాడు అని చెప్పాలి. అయితే రన్ అవుట్ ఛాన్స్ మిస్ కావడంతో ధోని పతీరానానీ చూస్తూ వాట్ యార్ అంటూ కాస్త సీరియస్ లుక్ ఇచ్చాడు అని చెప్పాలి. అయితే హెడ్ మైర్ మరుసటి ఓవర్ లోనే వికెట్ కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: