ఐపీఎల్ హిస్టరీలో అత్యుత్తమ బౌలర్లు ఎవరబ్బా అని లిస్టు తీస్తే అందులో చాహల్ పేరే మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ సీజన్లో ఇప్పుడు వరకు ప్రతి ఏడాది కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అదరగొట్టిన ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఏ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన మెరుగైన ప్రదర్శన చేస్తూ తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా ఇటీవల చాహల్ అరుదైన రికార్డును సృష్టించాడు.



 ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి విసిరితే అతన్ని బుట్టలో వేసుకొని వికెట్ దక్కించుకోవచ్చు అన్న విషయం చాహాల్ కి బాగా తెలుసు. ఈ క్రమంలోనే ఇక బ్యాట్స్మెన్లు స్వయంగా తప్పుచేసి వికెట్ కోల్పోయే విధంగా చాహల్ తన బౌలింగ్ తో టెమిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అందుకే చాహాల్ ను తెలివైన బౌలర్ అని కూడా అభివర్ణిస్తూ ఉంటారు ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు. అయితే పరుగులు కట్టడి చేయడమే కాదు కీలకమైన సమయంలో వికెట్లు కూడా పడగొడుతూ ఉంటాడు చాహల్. అలాంటి చాహల్ ఇటీవలే రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం పేలవ  ప్రదర్శనతో నిరాశపరిచాడు.



 అంతేకాదు అతని ఐపీఎల్ కెరియర్ లో ఒక చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరియర్ లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ తరుపున బౌలింగ్ చేసిన ఛాహల్ ఓకే ఓవర్లో 28 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఇందులో రెండు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటివరకు ఐపీఎల్లో చాహల్ ఇలా ఒకే ఓవర్ లో ఈ రేంజ్ లో అత్యధిక పరుగులు ఇచ్చుకోలేదు. ఇక ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: