ఓజోన్ పొరకు ప్రమాదం పొంచి ఉంది. వాతావరణ కాలుష్యం కారణంగా ఓజోన్ పొరకు ప్రతీ ఏడాది భారీ రంధ్రం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఏడాది ఏర్పడిన ఆ రంధ్రం అంటార్కిటికా ఖండం కంటే పెద్దది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యరశ్మితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే ఎంతో ప్రమాదకరపు ముప్పు కూడా ఉంది. అయితే సూర్యరశ్మిలోని ప్రమాదకర అల్ట్రా వైలెట్ కిరణాలు నేరుగా భూమిని తాకకుండా ఓజోన్ పొర కాపాడుతుంది. అయితే దక్షిణార్థ గోళంలో తెరుచుకున్న ఈ రంధ్రం 8.8మిలియన్ చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉందని వెల్లడించారు. ఈ రంధ్రం కారణంగా అమితమైన ఉష్ణోగ్రత  భూమికి పడడంతో వాతావరణ వైపరీత్యాలు కలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది పలుమార్లు మూసు కుంటూ ఉన్నప్పటికీ శాశ్వతంగా మూతపడడం లేదు.మరో వారంలో ఇది తాత్కాలికంగా మూసుకు పోయిందని పరిశోధకులు అంటున్నారు. ఈ భారీ రంద్రం శాశ్వతంగా మూసుకు పోవాలంటే 2050 వరకు ఆగాల్సిందేనట. భూమిపై వాతా వరణ కాలుష్య నివారణకు చేపడుతున్న చర్యలు ఫలించి అప్పటిలోగా గాల్లో ప్రమాదకర వాయువుల శాతం తగ్గు తుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఓజోన్ ఓ వాయువు. మూడు ఆక్సిజన్ పరమా ణువులు కలిస్తే ఒక ఓజోన్ అణువు ఏర్పడుతుంది. స్ట్రాటో ఆవరణంలో ఉండే ఈ ఓజోన్ పొర భూమికి 7 నుంచి 25 మైళ్ల ఎత్తులో విస్తరించి ఉంటుంది. ఇది భూమిపై నుంచి వెలువడే రసా యనాల కారణంగా మార్పులకు లోనై క్రమంగా కరిగిపోతుందని  తెలియజేస్తున్నారు. 80వ దశాబ్దంలో ఓజోన్ పొర కరిగి పోతుందన్న అంశాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు 1987 నుంచి హానికారక వాయువులు, రసాయనాలను నివా రించేందుకు కార్యచరణ ప్రారంభించాయి. మరో ముప్పై ఏళ్లకు కాలుష్య నివారణ చర్యలు ఫలించి ఓజోన్ పొరకు ఏర్పడుతున్న రంద్రం పూర్తిగా మూసుకు పోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: