బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన మోనాల్ - అఖిల్ బయట కూడా అదే ఫాలో అవుతున్నారు. తరచూ కలవడం, పార్టీలు చేసుకోవడం వంటి వాటితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసి జంటగా 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అఖిల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..ఆ వెబ్ సిరిస్ ఎలా ఉంటుందో చూడాలి..