టీవీ లలో జరిగే ప్రోగ్రాంలో ఒక జంట మధ్య ఏదైనా జరిగింది అంటే దాన్ని పలు రకాలుగా చూపించి వైరల్ గా మారుస్తున్నారు యుట్యూబ్ ఛానెల్స్.. ఇక జనాలు కూడా వారిద్దరి మద్య ఏదో ఉంది అంటూ నమ్మెస్తారు. అలాంటి జంటలు ఇపుడు టీవీ లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా బుల్లి తెరపై కనిపించే వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇకపోతే జబర్దస్త్ కామెడీ షో జబర్దస్త్‌లో సుధీర్-రష్మి జోడీ తరువాత అంత క్రేజ్ సంపాదించుకున్న మరో పెయిర్ వర్ష-ఇమ్మాన్యుల్. గత కొన్ని రోజులుగా స్కిట్స్‌లో ఇమ్మాన్యుయేల్‌తో కలిసి రొమాన్స్ చేస్తుంది. అప్పుడప్పుడు వర్ష వేరే వారికి పెయిర్‌గా నటించినా.. ఇమ్మాన్యుల్తోనే ఆమె రొమాన్స్ బావుంటుంది.