అధికంగా ప్రోటీన్లను అందించే సీఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని సినీనటీ, బిగ్‌బాస్ ఫేం 'దివి' తెలిపింది. పోషక విలువలు కలిగిన మంసాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని ప్రొటీన్స్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా దివి నియమితులైంది. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించి మీడియాతో ఆమె మాట్లాడారు. వీలైనంత వరకు తన ఫుడ్ డైట్లో సీ ఫుడ్ ఉండేలా చూసుకుంటానని, ప్రస్తుతం యాంత్రిక జీవితంలో ఇలాంటి ఫుడ్ అవసరమన్నారు.