ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా రీల్స్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి.. ఇక ఈ వీడియోస్ యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సెలబ్రిటీలు సైతం రోజు ఏదో ఒక రిల్ చేసి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.. ఇక అంతే కాకుండా దొరికినప్పుడల్లా కొన్ని ఫన్నీ వీడియోస్, డాన్స్ వీడియోస్ చేస్తూ తన ఫాలోవర్స్ ని బాగానే పెంచుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా బుల్లితెర ఆర్టిస్ట్ అయిన యాంకర్ వర్షిణి కూడా రిల్ చేస్తూ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. బుల్లి తెర పై యాంకర్ గా, ఆర్టిస్టుగా గుర్తింపు పొందింది యాంకర్ వర్షిణి.


దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుండి బుల్లితెరపై అలరిస్తూనే ఉంది.. కానీ ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు.. అయితే సినిమాలలో నటించే అవకాశాలు రావడంతో అటువైపుగా వెళ్ళింది అన్నట్లుగా సమాచారం. ఇక బుల్లితెరపై ఉండే యాంకర్స్ కంటే ఎక్కువ గ్లామర్ ని పరిచయం చేస్తోంది వర్షిణి. ఇక సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గానే ఉంటుంది వర్షిణి.. ఇక తన అందచందాలతో కుర్రకారును బాగా అలరిస్తూ ఉంటుంది. దీంతో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.



బుల్లితెరపై ఎంట్రీ డాన్స్ లతోనే ఒక రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోస్ లతో బాగా రచ్చ చేస్తోంది ఇప్పుడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో నుంచి ఒక వీడియోను షేర్ చేసినది.. అందులో తను ఒక సినిమాలోని డైలాగ్ చెబుతూ కనిపిస్తోంది.. ఇక ఆ డైలాగులు చెబుతూ ఉన్నప్పుడే స్టైల్, ఎక్స్ ప్రెషన్స్ చూసి ఆమే అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. మరికొంతమంది మాత్రం వర్షిణి లో ఇలాంటి టాలెంట్ ఉందా అంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: