బుల్లితెరపై యాంకర్ రష్మీ కి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సుదీర్ తో జోడి కట్టడం వల్ల ఈమె పాపులర్ అవ్వడంతో పాటు పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. అయితే ఈమె హీరోయిన్ గా నటించిన పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. దీంతో ఆ మధ్య సినిమాలు మానేయబోతున్నట్లుగా కూడా తెలియజేసింది. కేవలం బుల్లితెరపైనే యాంకర్ గా కొనసాగించాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లుగ తెలుస్తోంది. అయితే రీసెంట్ గా వచ్చిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది.


ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి షోలకు యాంకర్ గా రష్మీ నే కొనసాగుతోంది. అయితే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటో షూట్లతో పాటు మూగ జంతువులకు జరుగుతున్న అన్యాయాల పైన కూడా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఒక హాట్ వీడియోను షేర్ చేసింది రష్మీ. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఒక లవ్ సింబల్ ని చూపించింది. అందుకు సంబంధించి ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.


ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరొకవైపు సినిమాలలో ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తూ ఉంటోంది రష్మి. ఇక రష్మీ ఎప్పుడూ వివాదాలకు దూరంగానే ఉంటుందని చెప్పవచ్చు. త్వరలో రష్మీ వివాహం చేసుకోబోతోంది అనే వార్తల కూడా చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఈ విషయంపై ఎప్పుడు స్పందించలేదు. మరి రాబోయే రోజుల్లో నైనా తన వివాహం గురించి అసలు విషయాన్ని బయటపెడుతుందేమో చూడాలి. కానీ అభిమానులు మాత్రం సుధీర్, రష్మి ఒకటైతే బాగుంటుందని భావనలో ఉన్నారు. రష్మీ బుల్లితెరపై రెమ్యూనరేషన్ విషయంలో బాగానే సంపాదిస్తోందని చెప్పవచ్చు. రష్మీకి సంబంధించి ఈ వీడియో మాత్రం చాలా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: