ప్రపంచ వ్యాప్తంగా భారీగా అమ్ముడు పోయిన ఫోన్లలో ఐదు శాంసంగ్ ఫోన్లు ఉండగా..రెండు యాపిల్ ఫోన్లు,మూడు షియోమీ ఫోన్లు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే చైనా స్మార్ట్ ఫోన్ల షిప్ మెంట్లు బాగా పడిపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కేవలం షియోమీ మినహా మిగతా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లన్నీ పతనాన్ని చవిచూశాయి. హువావే 18 శాతం, వివో 13 శాతం, ఒప్పో 18 శాతం మేర పడిపోయాయి. ఐఫోన్ కూడా గతం తో పోలిస్తే ఈ ఏడాది నష్టాల్లోనే నడిచిందని నిపుణులు అంటున్నారు..