తాజాగా వన్ప్లస్ నుంచి రాబోయే తదుపరి మొబైల్ వన్ప్లస్ 9ప్రోకి చెందిన ఫోటోలు బయటకి విడుదలయ్యాయి. వనిల్లా వన్ప్లస్ 9ప్రోకి చెందిన చిత్రాలను యూట్యూబర్ డేవ్2డి లీక్ చేసాడు. లీకైన ఫోటోలను బట్టి చూస్తే మనకు వన్ప్లస్ 9ప్రో వెనుక కెమెరాలో రెండు ప్రధాన కెమెరాలతో పాటు, మరో రెండు ఇతర చిన్న కెమెరాలు ఉన్నాయి. అందులో ఒకటి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో టెలిఫోటో కెమెరాగా కనిపిస్తుంది..