రియల్ మీ 7 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయి ఐదు నెలలు కూడా కాకముందే దాని తర్వాతి వెర్షన్ రియల్ మీ 8ను రూపొందిస్తోంది. ఈ సిరీస్‌లో రియల్ మీ 8, రియల్ మీ 8 ప్రో ఉండే అవకాశం ఉంది. రియల్ మీ 8 లాంచ్‌ను కంపెనీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ టీజ్ చేశారు. రియల్ మీ ఈ మధ్యే మనదేశంలో నార్జో 30 ప్రో, నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. త్వరలో రానున్న రియల్ మీ ఫోన్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని రియల్ మీ టీజ్ చేసింది.