డిజిటల్ పే మెంట్స్ కోసం దుకాణాలలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క బ్యాంక్ కూడా ప్రయత్నిస్తుంది. కాంటాక్ట్‌లెస్ పేమెంట్ లు కోసం చేయడం కోసం సరికొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు..ఇండియాలో ధరించగలిగే కాంటాక్ట్‌లెస్ పేమెంట్ డివైజ్‌లను లాంచ్ చేసింది యాక్సిస్ బ్యాంక్. వేర్ ఎన్ పే పేరుతో ఈ డివైజ్‌లను తీసుకొచ్చింది. ఈ డివైజ్‌లు నేరుగా కస్టమర్ల బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయి ఉంటాయి. ఇవి ఒకరకంగా డెబిట్ కార్డుల్లాగా పని చేస్తాయి.