యూనిస్ తుఫాన్ ప్రభావంతో నిన్నటి రోజున వాయువ్య ఐరోపాలో.. కొన్ని గంటల పాటు 122 మైళ్ల వేగంతో గాలులు వీచడం జరిగాయట. ఈ తుఫాను కారణంగా దాదాపుగా పది మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఇక అంతే కాకుండా పదివేల కుటుంబాల ఇళ్ళల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచి పోయినట్లు తెలుస్తోంది.. సెంట్రల్ అట్లాంటిక్ లో ఏర్పడిన ఈ యూనిస్ తుఫాను జెట్ స్పీడుతో దూసుకువెళ్లి జోహార్ నుండి యూరప్ వైపుగా వెళ్లిందని.. అక్కడున్న ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని బ్రిటన్ వాతావరణ కార్యాలయంలో తెలియజేయడం జరిగింది.


ఈ తుఫాను పశ్చిమ ఇంగ్లాండ్ నుండి వెళుతూ కార్నివాల్లో తీరాన్ని తాకిన ట్లు సమాచారం.. దీంతో అక్కడ ఉండే సముద్రపు అలలు తీరాన్ని తాకాయట. ఇక ఇలాంటి సమయంలోనే ఒక మహిళ ప్రయాణిస్తున్న కారును చెట్టుకు ఢీకొనడంతో ఆమె అక్కడే మరణించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ గాలులకు పడిపోయిన దక్షిణ ఇంగ్లాండ్ లో వాహనంతో ఢీకొని మరొక వ్యక్తి కూడా మరణించాడు. ఇక నెదర్లాండ్ లో కూడా మరొక వ్యక్తి చెట్టు విరిగి మరణించాడు.. ఇక బెల్జియంలో కూడా తీవ్రమైన గాలులు వల్ల ఆస్పత్రిలోని పై కప్పు ఎగిరిపోయి ఒక వ్యక్తి మరణించాడు.


ఇక బ్రిటిష్ చెందిన ఒక వ్యక్తి కూడా పడవలో నుండి నీటిలోకి ఎగిరిపడి మరణించారు. ఇక లండన్ లో కూడా అత్యధిక గాలులు వీచడం వల్ల అక్కడ ఒక తెల్లటి గోపురం పైకప్పు కూడా చెల్లాచెదురుగా పడి పోయిందట. ఈ తుఫాను ఇంగ్లాండ్ లో అత్యధికంగా నమోదైన తుఫానుగా రికార్డు అయినట్లు సమాచారం. ఇక నిన్నటి రోజున వాతావరణ కార్యాలయం తుఫాన్ నుండి భీకరమైన గాలులు వెళ్ళువడ్డాయని అక్కడ ఉండే అధికారులు తెలియజేశారు. ఈ గాలులు భూభాగం ఐరోపా వైపు వెళుతున్నట్లుగా అక్కడ అధికారులు హెచ్చరించడం జరిగింది. ఇక అందుచేతనే యునైటెడ్ కింగ్డమ్ అంతట విమానాలను రద్దు చేసినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: