సాధారణంగా ఈ భూమి మీద ఉండే జీవులలో మనుషులే అతి తెలివైన వారు అని అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో ముందు వెనుక ఆలోచిస్తూ ఇక మనుషులు అన్ని పనులను చేస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. అయితే మనుషులు తెలివైన వారు అనుకోవడం మంచిదే కానీ మనుషులు మాత్రమే తెలివైన వారు అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్లే అవుతుంది అని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు తెర మీదికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండే జంతువులు సైతం ఇక మనుషుల లాగానే ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సాధారణంగా అడవి జంతువులలో భారీ ఆకారంతో ఉండేది ఏనుగు. ఇక మనుషులతో ఎక్కువగా దగ్గర సంబంధం కలిగి ఉండే జంతువు కూడా ఏనుకే కావడం గమనార్హం. అయితే ఇక అడవుల్లో ఉండే అన్ని జంతువులతో పోల్చి చూస్తే అటు ఏనుగు ఎంతో తెలివైనది అని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు అని చెప్పాలి. అచ్చం మనిషి లాగానే హావా భావాలను పండించడమే కాదు ఇక ప్రతి పని విషయంలో ఎంతో తెలివిగా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇకపోతే మనుషులు లాగానే ఏనుగులు కూడా ప్రతి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తాయని ఏ పని చేయాలన్నా ముందు వెనక ఆలోచిస్తూ కాస్త జాగ్రత్త పడుతూనే ముందుకు సాగుతాయి అన్న విషయం ఇక ఇటీవల వైరల్ గా మారిపోయిన వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.. ఇక్కడ ఏకంగా ఒక భారీ ఏనుగు తెలివి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక భారీ ఏనుగు ఒక ఫెన్సింగ్ వైర్ వద్దకు వస్తుంది. ఇక ఆ ఫెన్సింగ్ వైర్ దాటాలని అనుకుంటుంది. అయితే సాధారణంగా ఇలాంటి ఫెన్సింగ్ వైర్ కు కరెంటు కనెక్షన్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ ఫెన్సింగ్ తీగలకు కరెంట్ ఉందా లేదా అన్న విషయాన్ని ఏనుగు ముందుగా తన కాళ్లతో తాకుతూ గమనించింది. ఇక ఆ తీగలకు కరెంట్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఎంతో సులభంగా తీగల మీద నుంచి రోడ్డు దాటుకుంటూ వెళ్ళింది ఏనుగు.

మరింత సమాచారం తెలుసుకోండి: