అదేంటో కానీ ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా మాయే కనిపిస్తుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా మాయలో మునిగి తేలుతున్నారు. ఇక ఈ మాయ నుంచి బయటపడటానికి అస్సలు ఇష్టపడటం లేదు. గంటల తరబడి కాలం గడిపేస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు అయితే సోషల్ మీడియా మాయలో మునిగిపోతున్న జనాలు చేస్తున్న పనులు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలోనే రోజురోజుకీ ఇంటర్నెట్లో ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది. ఏకంగా టీచర్ చేసిన పనికి ప్రస్తుతం నెటిజన్స్ అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్ అయ్యుండి ఇలాంటి వెక్కిలి చేష్టలు  ఏంటి అని ఎంతోమంది నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే ఒక టీచర్ ఏకంగా ఫ్లాటి కమరియా మేరీ పాటకు విద్యార్థులతో కలిసి డాన్స్ చేశాడు..


 తన క్లాస్ టైం లో పాఠాలు  బోధించాల్సింది పోయి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని ఆశపడ్డాడు ఆ ఉపాధ్యాయుడు. ప్లాటీ కమరియ మేరి అనే పాటకు విద్యార్థులను డాన్స్ చేస్తూ అతను కూడా వెక్కిలి డాన్సులు చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది మానేసి ఇలా సోషల్ మీడియా పోకడలు నేర్పించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురు శిష్యు సంబంధానికి తగ్గట్లుగా ఉపాధ్యాయులు వ్యవహరిస్తే బాగుంటుందని మరి కొంతమంది చివాట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: