కావాల్సిన ప‌దార్థాలు:
ఉసిరికాయలు- ఆరు
ఆవాలు- అర స్పూన్ 
ఉప్పు-  తగినంత 

 

క‌రివేపాకు- కొద్దిగా
నూనె- త‌గినంత‌
పల్లీలు- కొద్దిగా
ఎండు మిర్చి- ఐదు

 

మినప్పప్పు- ఒక టీస్పూన్ 
శెనగపప్పు- రెండు టీ స్పూన్లు
ఉడికించిన రైస్- ఒక క‌ప్పు
కొత్తిమీర‌- కొద్దిగా

 

తయారీ విధానం: 
ముందుగా ఉసిరికాయల్లో గింజల్ని తొలగించి మిక్సీలో ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన రైస్‌ను ఓ ప్లేటులో వేసి ఆరబెట్టుకోవాలి. త‌ర్వాత స్టౌ వెలిగించి ప్యాన్ పెట్టి… నూనె వెయ్యాలి. నూనె వేడెక్కాక ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి వేపాలి. అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి. అందులో పసుపు, కరివేపాకు,  ఎండు మిర్చి వెయ్యాలి. 

 

ఇప్పుడు అందులో రైస్ వేసి కలపొచ్చు. లేదా… ఆ మిశ్రమాన్ని రైస్‌లో వేసి కలపొచ్చు. లాస్ట్‌లో కొత్తిమీర చ‌ల్లితే స‌రిపోతుంది. అంతే ఉసిరి పులిహోర రెడీ. దీన్ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేదా ఆప్ట‌ర్‌నూన్ లంచ్‌లోనైనా తినొచ్చు. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: