ఎంతో మంది ఆటిజం బాధిత చిన్నారుల పాలిట ప్రత్యక్ష దైవంగా కొనియాడబడుతున్నారు డాక్టర్. శ్రీజ సరిపల్లి. తాను కన్న కొడుకు పడుతున్న బాధలో నుండి, ఆ తల్లి వేదనలో నుంచి పుట్టింది పినాకిల్ బ్లూమ్స్ అనే ఒక నెట్ వర్క్. కొన్ని వేల మంది చిన్నారులను థెరపీ ద్వారా బాగు చేసి విజయవంతంగా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీజ సరిపల్లి. వారి పుట్టిన రోజు సందర్భంగా, ఆమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
డాక్టర్ శ్రీజ సరిపల్లి పుట్టింది గుడివాడ అయినా పెరిగింది, చదువుకుంది అంతా హైదరాబాద్ లోనే. చదువుకునే రోజుల్లోనే చాలా చిన్న వయసులో మేనరికం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక అంత సజావుగానే సాగింది. అందరిలాగానే ఎంతో నార్మల్ లైఫ్ ని లీడ్ చేసారు శ్రీజ సరిపల్లి. 19 ఏళ్ళ చిన్న వయసులోనే వారి ఆనందమయమైన జీవితంలోకి మొదటి సంతానంగా బాబు సంహిత్‌ పుట్టాడు. పెళ్లయ్యాక కూడా శ్రీజ గారు చదువులపైనా శ్రద్ధ కనబరచడంతో కుటుంబం అంత కూడా ప్రోత్సహించారు. ఒక బాబుకి జన్మనిచ్చిన కూడా ఆమె న్యూట్రిషనిస్ట్ గా ఎంతో చక్కగా అటు కుటుంబాన్ని ఇటు చదువులను పూర్తి చేశారు.

ఇందుకు పూర్తిగా తన భర్త కోటి గారే కారణం అంటారు శ్రీజ సరిపల్లి. నిజానికి ఇక్కడివరకు ఆమె జీవితంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. కానీ బాబుకి రెండేళ్ల వయసు వచ్చాక అందరి పిల్లల్లా మాట్లాడలేకపోవడం మరియు వినికిడి లోపం ఉన్నట్టుగా వారు గుర్తించారు. ఇక అది మొదలు అక్కడ నుండి ఎన్నో బాధాకరమైన రోజులు, నెలలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ తల్లిగా తాను ఓడిపోలేదు. ఎంతో కష్టమైనా క్లిష్టమైన ఆటిజం సమస్యను శ్రీజ సరిపల్లి గారు తన భుజాలపైన మోయలేని నిర్ణయించుకున్నారు.

కోట్ల ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ కొడుకును విదేశాల్లో పెంచుకోగలిగే స్థోమత ఉన్నా కూడా ఆమె తన లాగ బాధ పడుతున్న తల్లుల గురించి ఆలోచించారు. ఏ ఒక్క తల్లి కూడా అమ్మ అనే పిలుపుకు దూరం కాకూడదు అని అహర్నిశలు కష్టపడ్డారు. ఈ రోజు పినాకిల్ బ్లూమ్స్ ద్వారా వేల మంది చిన్నారులు తిరిగి మామూలు జీవితం గడిపేందుకు కొత్త టెక్నాలజీతో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆటిజం లేని రేపటి కోసం ఆమె ఈ రోజు కష్టపడుతున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: