శరీర వర్ణం కాంతులీనుతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరికి పుట్టుకతోనే మంచి వర్ణం ఉంటుంది. మరి కొందరికి పెరిగి పెద్దయిన కొద్దీ తగిన మెళకువలు పాటించడంవల్ల చక్కని రంగు వస్తుంది. శరీరం మృదువుగా కాంతులీనుతూ ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ మెలకువులు పాటించండం కష్టం అని ఎంత మాత్రం అనుకోవద్దు. సింపుల్ టెక్నిక్స్ పాటించి మెరిసే మేని వర్ణాన్ని మీ సొంతం చేసుకోండి. ప్రతిరోజు నియమంగా సున్నిపిండితో ఒళ్లంతా రుద్దుకుని స్నానం చేయండి. ఇందువల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోవడమే కాకుండా, మురికిపోయి శరీరం పరిశుభ్రమవుతుంది. శరీరం నిగారింపును సందరించుకోవడానికి ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.
వారానికి ఒకసారి శరీరానికి నలుగు పెట్టుకుని స్నానం చేయడం అలపవరుచుకోండి. కొబ్బరి నూనె లేదా నువ్వులనూనె శరీరమంతా రాసుకొని పెసరపిండి లేదా సెనగపిండితో రుద్ది స్నానం చేడం వల్ల మేని వర్ణం నిశ్ఛయంగా మెరుగవుతుంది. ఇంట్లో అందుబాటులో ఉన్న పండ్లు తీసుకొండి. అరటిపండు, చక్కెరకేళి, మామిడిపండు, బత్తాయి, కమలా, పుచ్చకాయ, బొప్పాయి, వంటి ఏ పండు అయినా తినండి, అవి తిన్న తర్వతా కొద్ది భాగాన్ని మిగిల్చి మీ వీలును బట్టి ముఖానికి, మరో రోజు మెడకు, ఇంకొక రోజు చేతులకు ఈ ప్రూట్ ప్యాక్‌ను ఉపయోగించ వచ్చు.
వారానికి ఒకటి రెండుసార్లు సెనగపిండి, నిమ్మరసం, తేనెతో కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, పట్టించండి. ఈ విధంగా నాలుగైదు సార్లు చేసిన తర్వాత తేడా చూడండి. మీ మేని వర్ణంలో వచ్చిన మార్పు గ్రహించి మీరే సంబరపడుతారు. కలబంద మొక్క మీ పేరట్లో ఉంటే అప్పడప్పుడు ఈ మొక్క ఆకులోని గుజ్జును చర్మంపై పూయండి కలబంద(ఆలోవేరా) శరీర వర్ణాన్ని ఇనుమడింపజేస్తుంది.
ఎండలో వెళ్లేటప్పడు తప్పకుండా గొడుగు వాడడం అలవాటు చేసుకోండి. ఇందువల్ల మేని వర్ణం నల్లబడుకుండా జాగ్రత్తపడవచ్చు. రసాయన క్రీముల జోలికి పోకుండా హెర్చల్ సౌందర్య సాధనాలు వాడడం అలవాటు చేసుకోండి. సహజసిద్దమైన సౌందర్య సాధనాల వాడకంవల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలగవు.
మేని వర్ణాన్ని మెరుగు పరుచుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇందుకు కావలసిందల్లా కొంచెం శ్రద్ద, ఓర్పు, వేలకు వేలు ఖర్చు చేయకుండా ఇంట్లో అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుని శరీర వర్ణాన్ని పదికాలలపాటు పసిమివర్ణంలో ఉంచుకోవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: