బాస్మతీరైస్ : 2 కప్పులు
ఉల్లిపాయలు : 2
క్రీం : 1 కప్పు
పాలు : 2 కప్పులు
టొమోటా కెచప్ : 5 చెంచాలు
ఉప్పు : సరిపడ
కారం : సరిపడ
బటర్ : 3 చెంచాలు
టాపింగ్ కి కావాలసినవి :
స్ప్రింగ్ ఆనియన్స్ పీసెస్ : ½ కప్పు
క్రీం : 1 కప్పు
టొమోటా కెచప్ : 5 చెంచాలు.
పంచదార :4 చెంచాలు
తురిమిన ఛీజ్ : కప్పులు
కారం : సరిపడ ఉప్పు : సరిపడ
బటర్ : 3 చెంచాలు
తయారీ ఎలా ?
ముందుగా ఎక్కువ బాస్మతిరైస్ ను శుభ్రంగా కడిగి అరగంట పాటు నీటిలో నానపెట్టి ఉంచాలి.
తరువాత ఎక్కవ నీటితో ఉడికించి పదునుగా ఉడికించి వార్చాలి.(ఎక్కువ ఉడికితే అన్నం మెత్తబడిపోతుంది) ఉల్లిపాయలను సన్నగా కట్ చేయాలి.
ప్యాన్లో బటర్ వేసి ఉల్లిముక్కలను వేసి దోరగా వేపుచేయాలి. వేగిన ముక్కలను ఉడికిన రైస్ వేసి సన్నటి గరిటతో అన్నం చిదిమిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ మరో నిమిషం వేపుకోవాలి.
తరువాత పాలు పోసి మంట తగ్గించి ఉడికించాలి. ఉప్పు, కారం, పంచదార, కూడా వేసి అరనిమిషం కలిపి దించి క్రీం కెచస్ కలిపి పక్కన ఉంచాలి.
గ్రీజ్డ్ బేకింగ్ ట్రేలో ఈ మిశ్రమాన్ని పోయాలి.
టాపింగ్ తయారీ కోసం బాండీలో 3 చెంచాల నెయ్యి వేసి వేడి చేసి బఠాణీ వేసి పద్ద మంట మీద వేపాలి. వేగుతున్న వీటికి ఛీజ్ తప్ప మిగిలినవన్నింటిని వేసి వేపాలి.
ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలోకి రైస్ మీద పోసి తురిమిన ఛీజ్ ను పైన అంతా చల్లాలి. బటర్ ని కూడా పైన చల్లీ ఓవెన్లో 10 నుంచి 12 నిమిషాలపాటు ఉంచాలి తరువాత తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: