రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోవడం చర్మ సౌందర్యానికి ప్రధానం ఉదయం బ్రేక్ ఫాస్టుగా పళ్లని వాడితే మంచిది.  అది జీర్ణశక్తిని పెంచి, రక్తాన్ని శుద్ధిచేసి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. పంచదార లేకుండా లేదా, ఏలకులు, అల్లం వంటివి వేసే మసాలా టీ (పంచదార లేకుండా లేదా, అతి తక్కువ షుగర్తో) వాడితే జీర్ణశక్తి పెరిగి, ఒంట్లోని మలినాలు పోయి సౌందర్యం ఇనుమడిస్తుంది.  కమలాపళ్ల, నిమ్మపళ్ల తొక్కలతో ఒంటిని తోముకుంటే చర్మం నిగనిగ లాడుతోంది. గాఢమైన కెమికల్ సోప్స్ వాడకూడదు.  గోరవెచ్చని నీరు మాత్రమే చర్మశుభ్రతకి బాగా పనిచేస్తుంది. తాజా గాలి, ఉదయం వేళ్ళల్లోని తాజా ఎండ, నడక వంటి వ్యాయామాలు చర్మ సౌందర్యానిక అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: