జోరున వర్షం పడుతోందా? చలికాలం పడకపై నుండి లేవాలనిపించటం లేదా ? ఒక కప్పు పుధీనా చాయ్ తాగండీ... పుదీనా ఆకులు ఇచ్చే సువాసనలు ఘాటు, రుచి, మీలోని బద్దకన్నంతా ఒక్కపెట్టున వదిలించేస్తాయి. ఎంతో ఆనందంగా భావిస్తారు. పుదీనా ఆకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీన కాలంనుండి ఎంతోమంది ప్రజలు ఒక ఔషధంగా వాడుతున్నారు. పుదీనాలో అనేక రకాలన్నాయి. ప్రతి రకం పుదీనాకి ఒకో రకమైన మంచి రుచి, వాసనలున్నాయి. మన ఇండ్లలో చేసుకునే అనేక వంటకాలకు రుచి, వాసన, దాని ఔషధ ప్రయోజనాలకు గాను పుదీనాను చేరుస్తాము. చిరుతిండ్లు, పండ్లు, పండ్లరసాలు, సలాడ్లు ఎవైనా సరే పుదీనా ఆకు పడాల్సిందే. పుదీనా ఆకులను వంటకాలలో ప్రధాన సుగంధంగా భారతీయులు, మధ్య ప్రాచ్ఛ దేశాల, వారు అధికంగా వాడతారు. రుచికరమైన పెరుగుకు పుదీనా జోడించి తింటారు లేదా వీరు తాగే టీని పుదీనా ఆకులు వేసి తయారు చేసి తాగుతారు. పుదీనాచాయ్ మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో బాగా పేరుపండింది. ధాయ్ వంటకాలలో దీనిని సూప్లలోని ఇతర కూరలలోను వాడతారు. యూరఫ్ దేశాలలోని పుదీనా మొక్క కంటే ఆసియా దేశపు పుదీనా మొక్క మంచివాసన, రుచి కలిగి ఉంటుంది. పుదీనా ఆకు ప్రయోజనాలు పరిశీలిస్తే: పొట్టనొప్పిని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పుదీనా ఛాయ్ తాగితే, మలబద్దకం పోయి, పొట్ట శుభ్రపడటం, చర్మ సంబంధిత మొటిమలు నివారించబడుతాయి.  పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మ మంటలకు పోగడుతాయి. పుదీనా శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. పుదీనా ఆకులను ఫేస్టు చేసి వాడితే దంతాలు తెల్లగా మెరిసిపోతాయి. చెడుశ్వాస నివారించబడుతుంది. పుదీనా శరీర రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది. అన్ని ప్రయోజనాలున్న పుదీనా ఆకు ఆరోగ్యం బాగుండాలంటే తప్పక మన వంటకాలలో చేర్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: