నేరెడు చూస్తే నోరూరని వారెవరుంటారు చెప్పండి. కాస్త ఉప్పు, కారం కలపి తింటే వచ్చే రుచే రుచి ఇదే నేరేడు కాయను మజ్జిగలో ఊరేసి తింటే పరమానందం. అంతేకాదు శరీరానికి మంచి చలువ చేస్తుంది. ఇందులో ఔషద గుణాలున్నాయి. తినేటప్పడు కాస్తంత కష్టంగా అనిపించినా నేరేడు కడుపులోకి చేరిన తరువాత చేసే మేలు కాస్త ఎక్కువగానే ఉంటుంది. నేరేడు విత్తనాలను బాగా రుబ్బి ఆ పేస్ట్ ను ముఖానికి పూస్తే మొటిమలు మటుమాయం అంటున్నారు. ఆయుర్వేద వైద్యనిపుణులు. నేరేడు ఆరోగ్య ఫల ప్రధాయాని, కడుపులో పేరుకుపోయిన పధార్ధాలను తొలగిస్తుంది. నేరేడు పండు చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. షుగర్ వ్యాధీ తీవ్రతను తగ్గిస్తుంది నేరేడుపండు మూత్ర సంబందిత వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వ్యాధులు తగ్గు ముఖం పడతాయి. ఒక సీజన్ లో లభించే నేరుడును సాధారణ స్థితిలో ఉన్న ప్రతీ ఒక్కరు తినడం మంచిది. కాని గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తిన కూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: