నాలుగు బాగాలు దాధంపొడి, రెండు భాగాలు పన్నీరు, ఒక బాగం తేనే బాగా లేహ్యంలా కలిపి ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసుకుని 15 నిమిషాలు ఉంచి తదుపరి పన్నీటితో ముఖం కడిగివేయాలి. టీ స్పూన్ కమలాపండు రసం, ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక భాగం తేనె కలిపి వెంట్రుకలకు తగలకుండా ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాలు ఉంచి కడిగి వేయాలి. ఇలా ప్రతీరోజు చేస్తుంటే కాంతివంతంగా తయారవుతుంది.
పాలతో గంథం చెక్క నూరి దానిలో చిటికెడు పసుపు కలిపి ప్రతినిత్యం ముఖానికి రాసుకుంటూ వుంటే ఎండ తీవ్రత నుండి దూరం చేయడమే కాకుండా చల్లగా వుండి ముఖంకాంతివంతంగా తయారవుంతుంది. రెండు స్పూన్లు పాలతో రెండు బాధం పప్పులను వేసి మెత్తగా నూరి రోజూ ముఖానికి రాస్తుంటే ముఖం పట్టువలే శోభాయమానంగా ఉంటుంది.
రాత్రిపూట పాలల్లో పచ్చిశనగపప్పును వేసి ఉదయాన్నే పలానుండి ఆ పప్పును తీసి మెత్తగా రుబ్బాలి. దానిలో చిటికెడు పసుపు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి. తదుపరి ఇలా తయారైన పధార్థాన్ని దేహమంతా బాగా పట్టించాలి. పట్టించిన అరగంట తరువాత మలివెచ్చని నీటిలో కొంచెం పన్నీరు కలిపి స్నానం చేస్తే దేహ కాంతి ఇనుమండించి చర్మం అతి మృదువుగా మారిపోతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: