మసాలా దినుసులుగా ఉపయోగించే అల్లం ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు అల్లాన్ని వాడితే, డాక్టరు అవసరం కూడా ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడ్డంలో అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అల్లం రసాన్ని వెచ్చ చేసి, కీళ్ళ నొప్పులున్న ప్రాంతంలో రాస్తే, ఉపశమనం ఉంటుంది. నూనెలో వేయించిన అల్లం ముక్కలను తింటే గర్భవతులకు వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది. గొంతునొప్పి ఉన్నవారు కొంచెం అల్లం రసం తాగితే తగ్గిపోతుంది అల్లం, ఉల్లిపాయ ముక్కలతో కషాయం చేసుకుని తాగితే, వాంతులు తగ్గిపోతాయి. అల్లం రసంలో తేనెను కలిపి నాకితే, నోటిపూత తగ్గుతుంది. అల్లాన్ని ఎండబెట్టి పొడిచేసి, ఆ పొడిలో నీరు కలిపి ముద్ద చేసి, ఆ ముద్దను కణతలకు, తలకు పట్టిస్తే, తలనొప్పి తగ్గుతుంది. అల్లంరసాన్ని గోరువెచ్చగా వేడి చేసి ఒకటి,రెండు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో నిమ్మరసం చేర్చి, భోజనానికి ముందు తీసుకుంటే, వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అజీర్తిని తగ్గిస్తుంది. అల్లం రసంలో పటికబెల్లాన్ని కలిపి త్రాగితే, భుక్తాయాసాన్ని నివారిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: