ఇటీవలే బ్రిటన్ వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు భారత్ సెకండ్ వేవ్ కరోనా వైరస్ తో అల్లాడి పోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలఫై పూర్తిగా నిషేధం విధించాయి. కాని ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గిపోవడం వ్యాక్సినేషన్  ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఇక భారత్ నుంచి ప్రయాణికులను అనుమతి ఇస్తూ ఉండడం గమనార్హం.  అయితే భారత్లో ప్రస్తుతం కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ అనే రెండు టీకాలు అందుబాటులో ఉండగా కేవలం కోవిషీల్డ్ తీసుకున్న వారికి మాత్రమే ప్రపంచ దేశాలు అనుమతిస్తున్నాయి.


 అయితే ఇటీవలే బ్రిటన్ మాత్రం భారత టీకాలను చులకనగా చూసింది. రెండు డోసుల కోవిషీల్డ్ వేసుకున్నప్పటికీ భారత్ నుంచి బ్రిటన్ వచ్చినవారు పదిరోజుల క్వారంటైన్ లో తప్పనిసరిగా ఉండాలి అంటూ ఒక నిబంధన విధించింది.  ఇక ఈ నిబంధన పై స్పందించిన భారత ప్రభుత్వం అటు బ్రిటన్ నుంచి భారత్కు వచ్చే వారికి కూడా ఇలాంటి తరహా నిబంధనలు విధించి షాక్ ఇచ్చింది. ఇకపోతే ఇటీవలే భారత టీకా పై అనుమానాలు వ్యక్తం చేసిన బ్రిటన్కు చెంప పెట్టు లాంటి ఘటన జరిగింది ఇటీవల ఐక్యరాజ్యసమితిలో జరిగింది .



 ఇటీవలే ఐక్యరాజ్యసమితి కి సంబంధించినటువంటి సర్వ ప్రతినిధుల సభ యుఎన్ జి ఎ జరిగింది. ఈ సభలో యుఎన్ జి ఎ ప్రెసిడెంట్  ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ స్టేట్మెంట్ అటు బ్రిటన్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవలే యుఎన్ జి ఎ 76వ సమావేశం జరగ్గా ఈ సమావేశంలో మాట్లాడిన ప్రెసిడెంట్ అబ్దుల్లా సాహెబ్ తాను ఇండియాలో తయారు చేయబడిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లను రెండు డోసులు తీసుకున్నానని..  ప్రస్తుతం తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. భారత్ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. భారత వ్యాక్సిన్లు కూడా ఎంతో  బాగున్నాయి అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక అదే సమావేశంలో ఉన్న బ్రిటన్కు ఈ ఘటన చెంపపెట్టులా మారిందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: